#కాల్వినిస్టుల_చిక్కుముడులకు_క్రైస్తవుడి_సరళమైన_పరిష్కారములు
నా చిన్నతనంలో మా తాత ఈగ నర్సయ్య గారు ఇలా అనేవాడు "కానని మొహాని కప్ప దయ్యంలాగా కనపడింది" అని. అజ్ఞానికి సులువైన విషయాలు కూడా చిక్కుముడులౌతాయి. తనను తాను జ్ఞానినని చెప్పుకునేవాడికి రెండో ఎక్కము(2×2=4) కూడా TRIGONOMETRY లాగా కనపడింది.
హితబోధ పేరుతో రోగిష్టిబోధను చేసి తను ధోరని కూడా ఇలాగే వుంది.
హితబోధ వెబ్సైట్ లో వారు పెట్టిన ..... https://hithabodha.com/books/salvation/265-divine-predestination-in-salvation-objections-answered.html
ఈ వ్యాసముగా పిలుచుకుంటున్న యీ ఆయాసానికి చించిస్తూ, వారిది ఆయాసముతప్ప వ్యాసము కాదని నేను నా 👇👇👇వ్యాసముతో రుజువు చేయటము జరిగింది.
https://m.facebook.com/story.php?story_fbid=1397377323794388&id=100005664007145
యేదో జవాబివ్వాలి కాబట్టి నాలు వచనాలు paste చేసి వారి సంకుచిత జ్ఞానముతో, విస్తారమైన అజ్ఞానమును వివరణ అన్నట్టుగా ఇచ్చి వ్యాసము రూపములో డంపింగ్ చేయటము వారికి పరిపాటే కనుక వారి ఆనవాయితీని సహజసిద్ధంగానే కొనసాగిస్తున్నారు. వారి ఆ వ్యాసము ఆఖరులో "యెప్పుడూ మేమే జవాబివ్వాలా? క్రైస్తవులకు కొన్ని ప్రశ్నల చిక్కుముడులు కూడా మేము వేస్తాము విప్పండి" అంటూ చిక్కుముడుల పేరుతో వారికి తోచినంతలో, వారి జ్ఞానపు మేరలోనే కొన్ని ప్ఱశ్నలు వేసారు. ఐతే నేను సంధించిన అనేక ప్రశ్నలకు జవాబులు ఇంకా వారినుండి రాలేదు కనుక, అవికూడా వచ్చాక మీరనుకుంటున్న ముడులను విప్పుతాను అని అన్నాను. కానీ ఇంకా నా ప్రశ్నలను అటెంప్ట్ చేసే ధైర్యము కాల్విన్ దేవతా భక్తులు చెయ్యలేదు కనుక వారి నిస్సహాయ స్థితికి చింతిస్తూ నేను మాట ఇచ్చినట్టు వారి దృష్టికి చిక్కు ముడులైన వాటిని విప్పుటకు ఉపక్రమించాను. కాసుకోండి .......
వారి దృష్టిలో చిక్కుముడి నంబర్ 1⃣
*****************************"**
1 Peter(మొదటి పేతురు) 2:7,8
7.విశ్వ సించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వ సింపనివారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను.
8.కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి.
ఈ సందర్భంలో కొందరు తొట్రిల్లేవారు అందుకే నియమించబడ్డారని ఎందుకు రాయబడింది?
👉 ఇది హిత(రోగిష్టి)బోధ వారి ప్రశ్న....
ఈ వాక్యము దావీదు తన కీర్తనలో ....
Psalms(కీర్తనల గ్రంథము) 118:22
22.ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను.
ఈ ప్రవచనమే నెరవేర్పు సమయములో యేసు గుర్తు చేసాడు ....
Matthew(మత్తయి సువార్త) 21:42,43,44,45,46
42.మరియు యేసు వారిని చూచిఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువ లేదా?
43.కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.
44.మరియు ఈ రాతిమీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవనిమీద పడునోవానిని నలిచేయుననెను.
45.ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన చెప్పిన ఉపమానములను విని, తమ్మును గూర్చియే చెప్పెనని గ్రహించి
46.ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని జనులందరు ఆయనను ప్రవక్తయని యెంచిరి గనుక వారికి భయపడిరి.
పై విషయాలనే అపోస్తలుడైన పేతురు తన మొదటి పత్రికలో "యూదా జనాంగము కొరకు అనగా తన స్వకీయుల కొరకు వచ్చిన యేసును వారు తృణీకరించటము, తద్వారా అణ్య జనాంగమునకు రక్షణ ప్రాప్తించటము"ను ప్రస్థావించాడు. అసలు పేతురు పత్రికలోని భాగములో CALVINISM దాగి వుందా????
కాల్వినిస్టులు, వారి సిద్ధాంతము చెప్తున్నట్టుగా " ఎన్నుకోబడనివారు నరకానికి వెలతారు" అనే తాత్పర్యమును ఇక్కడ అన్వయించారు. కానీ యూదుల ఆ తొట్రుపాటు దేనిని సూచిస్తుంది?? యూదులు నశిస్తారు, వారు నరకానికి వెలతారు అనా?? కాదుకదా?? రోమా 11 అధ్యాయము "తన ప్రజలు విసర్జింపబడలేదని, వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును అని, యూదుడని అన్యుడనే బేధము లేకుండా సర్వమానవాళి రక్షింపబడాలనే దేవుని ఉద్దేశము 1 పేతురు 2:7-8 లో కనబడుతుంది. అంటే ఆ వాక్యాలను కాల్వినిజమ్ కు అన్వయించుకోవటము వారి బుద్ది హీనత, ఆత్మహత్యా సాదృష్యము కాదా ?? పాటకులూ....!! 1పేతురు 2:7-8 చిక్కుముడి యెక్కడుంది?? కాల్వినిజమ్ యెక్కడ కనబడుతుంది చెప్పండి??
వారి దృష్టిలో చిక్కుముడి నంబర్ 2⃣
*******************************
మొదటి సమూయేలు 2:22-25
ఏలీ బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నియు, వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకువచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి యిట్లనెను ఈ జనులముందర మీరుచేసిన చెడ్డకార్యములు నాకు వినబడినవి. ఈలాటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, యీలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పుచేసినయెడల దేవుడు విమర్శచేయునుగాని యెవరైన యెహోవా విషయములో పాపము చేసినయెడల వానికొరకు ఎవడు విజ్ఞాపనము చేయును? అనెను. అయితే యెహోవా వారిని చంప దలచి యుండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొఱ్ఱను వినకపోయిరి.
ఇక్కడ 'మాట విననందుకు యెహోవా వారిని నాశనం చేయాలనుకున్నాడు' అని కాకుండా 'యెహోవా వారిని నాశనం చేయాలనుకున్నాడు కాబట్టి వారు మాట వినలేదు' అనటమేంటి?
👉 ఇది హిత(రోగిష్టి)బోధ వారి మరో ప్రశ్న....
జవాబు యీవాక్యాలలోనే వుంది. కాకపోతే కాస్త మెదడు వాడాలి అంతే.
"దేవుడు ఏలీ కుమారును చంపజూచెను కాబట్టి వారు పాపము చేసిరి" అని వుందా?? లేదుకదా?? కాల్విని స్టుల ప్రకారము, వారి సిద్ధాంతమునకు యీ సందర్భమును అన్వయించుకోవాలంటే అలా వుండాలి. కానీ అలా లేదు. విచారణ చేసి, దీర్ఘశాంతము వహించి క్షమించదగిన పాపము కాదది.
నరునికి వ్యతిరేకముదా నరుడు చేసిన పాపమునకు విమర్ష దానికి విజ్ఞాపన దానికి క్షమాపన, రక్షణ వుంది అనే అర్థమిస్తున్నాయి ఆ వ్క్యాలు.
కానీ ఏలీ కుమారుల పాపము పరిపూర్ణమైంది, అది మరణమునకు అర్హమైనది. వారు దేవుని మంది ఆవరణలోనే స్త్రీలను చెరిచారు. ప్రధాన యాజకుడు అతిపరిశుద్ధ స్థలములో ప్రవేశించినప్పుడు చాలా పవిత్రముగా వుండి లోపలికి వెల్లాలి. తన ఆలోచనలు కూడా అపవిత్రములు కాకూడదు. ఆలోచనలలో సహితము అపవిత్రత వుంటే, అతిపరిశుద్ధ స్థలములో ప్రవేశించిన యాజకునిపై దేవుని ఉగ్రత దిగి వచ్చేది. అప్పుడు యాజకుడు అతిపరిశుద్ద స్థలములోనే మృతినొందేవాడు.
బైబిల్ లో మరణకరమైన పాపమును గురించిన ప్రస్థావన కూడా వుందని, ఆత్మకు వ్యతిరేకముగా పాపము చేయువానికి క్షమాపన లేదనే విషయాలు కాల్వినిజస్టులకు ఇంకా బోదింపబడలేదా?? యేమో !
👎 ఇందులో చిక్కుముడి యెక్కడ???
వారి దృష్టిలో చిక్కుముడి నంబర్ 3⃣
*****************************"**
సామెతలు 16:4
యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను.
దుష్టులను నాశన దినమునకు కలుగ జేయటంలో ప్రేమ ఎక్కడుంది? వారిని అసలు కలుగజేయకుండా ఉండుంటే అదే గొప్ప ప్రేమ అయిఉండేది కదా?
ఇది హిత(రోగిష్టి)బోధ వారి ఇంకో ప్రశ్న....
పాపం కాల్వినిస్టులు దేవునిని యేదోవిధంగా శాడిస్టులాగా చూపెట్టాలనే ప్రయత్నములో నానా గడ్డీ కరుస్తున్నారు. కానీ ప్రతీసారీ బొక్కబోర్లా పడడముకూడా వారు అలవాటు చేసుకున్నారు. కానీ యీ వచనము విషయములో మూతిపండ్లు రాలే స్థాయిలోనే బొక్కబోర్లా పడ్డారు.
కాల్వినిస్టులు తరచూ ఈ పద్యం ఉదహరిస్తారు, కొంతమంది నరకానికి పంపబడే ఉద్దేశ్యంతో వారిని దేవుడు దుర్మార్గులుగా సృష్టించాడని చెప్పటానికి కాల్వినిస్టులు తరచూ ఈ వచనమును ఉదహరిస్తారు.
కానీ దేవుడు ప్రేమయైవున్నాడు అని (1యోహాను 4:8,16), దేవుడు లోకమంతటిని అనగా అందరినీ ప్రేమిస్తాడు అని(యోహాను 3:16), హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారము నైనను బాధనైనను కలుగజేయడు అని(విలాప వాక్యములు 3:33), యెవరినీ శిక్షించటమూ ఇష్టపడనివాడు అని (యెహెజ్కేలు. 18: 30–32; 33:11; 1తిమో. 2: 4; 2పేతురు 3: 9) లేఖనాలు తేటతెల్లముగా చెప్తున్నాయి. మరి సామెతలోని యీ వాక్యము ఇలా వుంది కదా?? అని అంటే ... దాని అర్థంచేసుకునే విధానములో లోపముందని మనకు గోచరమౌతున్నది.
సామెతలు 16: 4 నైతిక క్రమం యొక్క భాషను ఉపయోగిస్తోంది. మంచికి ప్రతిఫలం బహుమానమును అనుభవించేలా మరియు చెడు ప్రతిఫలము శిక్షను అనుభవించేలా సృష్టిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ కోణంలో, దుర్మార్గులకు “ప్రతిఫలము"గా వారిపైకి వచ్చే "నాశనము" ను గురించి యీ వచనము తెలియజేస్తుంది. నీతిమంతులు(నీతి) బహుమానమునొందుటకు, దుష్టులు భక్తిహీనులు(దుష్టత్వము, భక్తిహీనత) శిక్షింపబడుటకు ఏర్పాటు జరిగింది.
ఇది నియామకము, దేవుడు నిర్ణయించిన క్రమము.
ఇది నియమమే కానీ దేవుడు పనికట్టుకుని కొందరిని నిర్భందించి నాశనమునకు పంపటము దేవుని స్వభావము కానే కాదు. దేవుని స్వభావమునకు విరుద్ధముగా ఆలోచించుట కాల్వినిష్టుల ఆత్మీయ దౌర్భల్యము.
👎 ఇందులో చిక్కుముడి యెక్కడ???
వారి దృష్టిలో చిక్కుముడి నంబర్ 4⃣
*****************************"**
(4) రోమా పత్రిక 9 వ అధ్యాయం, 10 నుంచి 23 వచనాల వరకూ ఉన్న వివరణ ఏమిటి?
ఇది హిత(రోగిష్టి)బోధ వారి బుద్ధిహీనతనుండి పుట్టిన ఇంకో ప్రశ్న....
దీనికి జవాబుగా సుధీర్ఘమైన వ్యాసము వ్రాయటము జరిగింది. చదుకొనుడి.
http://vakyapunadhi.com/node/7
https://m.facebook.com/story.php?story_fbid=1374893576042763&id=100005664007145
👎 ఇందులో చిక్కుముడి యెక్కడ???
వారి దృష్టిలో చిక్కుముడి నంబర్ 5⃣
*****************************"**
యోహాను సువార్త 10: 26. అయితే మీరు నా గొఱ్ఱెలలో చేరినవారుకారు గనుక మీరు నమ్మరు.
మీరు నమ్మరు కాబట్టి 'నా గొర్రెలు అనకుండా' 'నా గొర్రెలు కారు కాబట్టి నమ్మరు' అనడమేంటి?
ఇది కాల్విన్ మతస్తుల గర్భఫలమైన మరొక ప్రశ్న. ఇది కాల్వినిజమ్ కు ఊపిరి పోస్తుందని వారి మస్తిష్కమందు పుట్టిన దుష్ట ఆలోచన. ఈ వచనమును అర్థం చేసుకోవాలంటే యోహాను 10:24-26 వచనములు చదువాలి.
John(యోహాను సువార్త) 10:24,25,26
24.యూదులు ఆయనచుట్టు పోగై ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి.
25.అందుకు యేసు మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.
26.అయితే మీరు నా గొఱ్ఱెలలో చేరినవారు కారు గనుక మీరు నమ్మరు.
ఇది యూదులను గురించి యేసుద్వారా చెప్పబడినటువంటి మాటలు. వారు దేవుని ప్రణాళికలో భాగంగానే యేసుని నమ్మినవారి గుంపులో చేరరని, వారు తొట్రిల్ల్రని, మూలరాయిని తృణీకరించారని మనము పైన చదివాము కదా!? ఐతే అది శాశ్వతము కాదు, వారు కూడా రక్షింపబడతారు అని రోమా 11 అధ్యాయములో చెప్పుకున్నాము. ఐతే కాల్విను మతస్థులు యోహాను 10:26 ను యేలా చిత్రీకరిస్తున్నారంటే "వారిని అనగా యూదులను యేదో నరకంలోకి తోసెయ్యబోతున్నాడు మా CALVIGOD" అన్నట్టు. కానీ మా బైబిల్ దేవుడు అలా ఆలోచించలేదని నా వ్యాసము ద్వారా నిరూపన జరుగుతున్నది. యూదులు ధర్మశాస్త్రమునుబట్టి, అన్యుడు తన మనస్సాక్షినిబట్టి, క్రైస్తవుడు తన విశ్వాసమునుబట్టి తీర్పునొందుతారు.
1 Peter(మొదటి పేతురు) 4:17
17.తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును?
Romans(రోమీయులకు) 2:7-16
7.సత్ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.
8.అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును.
9.దుష్క్యార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, శ్రమయు వేదనయు కలుగును.
10.సత్ క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును.
11.దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు;
12.ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు.
13.ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతి మంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.
14.ధర్మ శాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు.
15.అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.
16.దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తుద్వారా మను ష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును.
👎 ఇందులో చిక్కుముడి యెక్కడ???
వారి దృష్టిలో చిక్కుముడి నంబర్ 6⃣
*****************************"**
అపొ. కార్యములు 13:48 మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.
ఇక్కడ 'విశ్వసించిన వారు నిత్యజీవానికి నియమించబడ్డారు' అనకుండా 'నిత్యజీవం కొరకు నిర్ణయించబడినవారు విశ్వసించారు' అనటమేంటి?
ఇది మరొక అపరిపక్వమైన కాల్వినిస్టుల ప్రశ్న
వీరి ఖర్మ యెలా కాలిందంటే వీరి వక్రీకరణలకి జవాబివ్వటానికి యెక్కువసార్లు యెక్కువ కష్టపడాల్సిన అవసరత మనకు ఏర్పడదు. యెందుకంటే వారి ప్రశ్నలకు జవాబులు వారు సంధించే ప్రశ్నకు దోహదపడే వచనానికి సరిగ్గా కింది వచనములోనో లేక పై వచనములోనో లేదా ఆ సందర్భములోనే దొరుకుతుంది. సరిగ్గా అదే Acts 13:48 verse విషయములో కూడా జరిగింది. Acts 13:46 చదివితే మనకు కాల్వినిస్టులకు జవాబు సులభంగానే దొరికిపోద్ధి. దానిని అర్థంచేసుకోవటము కూడా సులభమే. ఆ వచనములను పూర్తిగా చూడండి......
Acts(అపొస్తలుల కార్యములు) 13:46-48
46.అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరిదేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్య కమే; అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు,గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్లుచున్నాము;
47.ఏలయనగా నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి.
48.అన్యజనులు ఆమాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.
46 వ వచనమును గమనించండి:
పౌలు బర్నబాలు చెప్పిన సువార్త మాటలను వారు త్రోసివేసారు. వారిని వారే నిత్యజీవమునకు అపాతృలుగా చేసుకున్నారు.
IN THE SAME MANNER
తనను వెతుకు వారికి దేవుడు తాను దొరికేవాడు కనుక అన్యులకు దొరికాడు. దేవుని కృపవలన, ఉచితమైన రక్షణ పొందునట్లు వారు దేవుని విశ్వసించి నిత్యజీవమునకు పాతృలుగా చేసుకున్నారు.
నిర్ణయింటినబడినవారు అంటే యెవరు? అన్యులు. అక్కడ రెండు జనాంగములను గురించి లేఖనము వివరిస్తుంది. అక్కడ వున్న జనులను గురించి కాదు.
ముందు యూదులకు సువార్త ప్రకటించటము జరగాలి, వారు తృణీరిస్తారు. అప్పుడు నిర్ణయింపబడిన జనాంగమైన అణ్యులు ప్రభువును అంగీరించి దేవునిని మహిమపరుస్తారు. ఇది దేవుని ప్రణాళిక. అంతేకానీ అక్కడ వున్న ఆ గుంపును గురించిన విషయము కాదది.
దేవుడు మనుషులను వెతుకుతాడు, మానవుడు దేవుని వెతుకుతాడు.
https://m.facebook.com/story.php?story_fbid=1370946633104124&id=100005664007145
👎 ఇందులో చిక్కుముడి యెక్కడ???
వారి దృష్టిలో చిక్కుముడి నంబర్ 7⃣
*****************************"**
మత్తయి సువార్త 11:21-23 అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుపట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారుమనస్సు పొంది యుందురు. 22 విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. 23 కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన యెడల అది నేటివరకు నిలిచియుండును.
ఇక్కడ కొన్ని అద్భుతాలు, సూచక క్రియలు చేసుంటే కొన్ని పట్టణాలు మారుమనస్సు పొందుండేవి అని తెలిసికూడా దేవుడు ఆ పట్టణాల్లో ఆ అద్భుతాలు, సూచక క్రియలు ఎందుకు చేయించలేదు?
ఇది ఆ చీముపట్టిన పుండు (రోగిష్టి బోధ)నుండి లీకైన చీము (మరొక ప్రశ్న)..
కొరజీనా, బెత్సైదా పట్టనాలలో దేవుడు అద్భుతాలు చేసినా వారు రక్షణపొందలేదు అంటే దేవుడు చేతగానివాడని నిరూపించాలనుకున్నారా కాల్వినిస్టులు?? వారు రక్షణ పొందరని తెలిసి కూడా అద్భుతాలు చేసాడా యేసు?? యేసును రక్షకుడు, దేవుడు, మహోన్నతుడని అనుకుంటున్నారా లేక రోడ్లమీద గారడీ చేసేవాడని అనుకుంటున్నారా CALVINISTS??
కొరజీనా, బెత్సైదావారైనా లేక తూరు, సీదోను వారైనా వారికి సమీపములో దేవుడు వుంచిన రక్షణను పొందుట, దేవునియందు విశ్వాసముంచుట అనేది వారి వారి స్వయం చిత్తము లేక స్వేచ్చా సంకల్పము(Freewill) మీదనే ఆధారపడి వుందనే విషయము CALVINIST లకు బోధపడటము లేదా??
నమ్మినవారు రక్షింపబడతారు, నమ్మనివారికి శిక్ష విధింపబడుతుంది(మార్కు 16:16) అని బోధపడటంలేదా వారికి??
👎 ఇందులో చిక్కుముడి యెక్కడ???
ఇక ఈ CALVINIST ధుర్భోధను వాయించిన వాయింపు ఇప్పటికి ఇక చాలు. కాల్విన్ దేవత పడగ విప్పితే మల్లీ దానిని చితక తొక్కడానికి దేవుని సహాయముతో సిద్ధముగానే వుంటాను.
దేవుని చిత్తమైతే మల్లీ next వ్యాసముతో కలుద్ధాము
మన బైబిల్ లోని ప్రభువు Calvin దేవతా భక్తుల మనో నేత్రములు తెరియునుగాక .... ఇదే నా ప్రాథన ఆమెన్ 🙏🙏🙏🙏🙏
GOD BLESS YOU ALL
Bro EGA VENKATESH