Share

దేవుడు

భూమ్యాకాశములను దృశ్యాదృశ్యములగు సమస్తమును సృజించిన సర్వశక్తిగల దేవుడు ఒక్కడే అని ఆయన తండ్రికుమార, పరిశుద్ధాత్మ అను విభిన్నమైన, ముగ్గురు దైవిక వ్యక్తులుగా ఆది నుండి ఉన్నాడు అని మేము నమ్ముతున్నాము.

పరిశుద్ద లేఖనములు

66 పుస్తకాలు ఉన్న బైబిల్ గ్రంథం, దేవునిచే ప్రేరేపించబడి మూలప్రతులలో ఏ పొరపాట్లు లేకుండాబోధలో ఏ పొరపాట్లు లేకుండాప్రతి మాట దైవావేశము వలన వ్రాయబడిపరిపూర్ణంగా భద్రపరచబడిన దేవునివాక్యంగా మేము విశ్వసిస్తున్నాము.

దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తలద్వారా ముందు వాగ్దానముచేసెను(రోమీయులకు 1:4). సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లుఅనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు(అపోస్తలులకు) ప్రత్యక్షపరచబడిన మర్మమునిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడియున్నది(రోమీయులకు 16:25). దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకునుఖండించుటకునుతప్పు దిద్దుటకునునీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై ఉండి(2తిమోతికి 3:16), పూర్తిగా నమ్మదగినవిమరియు విశ్వాసం ప్రవర్తన యొక్క అన్ని విషయాలలో చివరి అధికారం గలవి.

 

యేసుక్రీస్తు

వాక్యమైయున్న దేవుడు సశరీరుడుగా భూమి మీదికి కన్య మరియ గర్భము ద్వారా వచ్చి పాపరహిత జీవితం జీవించి, అద్భుత క్రియలు, సూచక క్రియలచేసి సర్వ మానవాళి కోసం సిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంది మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. ఈయన త్వరలో తన మహామహిమా ప్రభావములతో శక్తితో త్వరలో తిరిగి వస్తాడని లోకమునకు తీర్పు తీరుస్తాడని నమ్ముతున్నాము.

యేసుక్రీస్తు నిజముగా దేవుడు మరియు నిజముగా మానవుడనిదేవుని యొక్క ఉనికిస్వభావం మరియు ఉద్దేశ్యాలను ప్రత్యేకముగాఖచ్చితంగా మరియు తగిన రీతిగా బయలుపరిచాడని మేము నమ్ముతున్నాముఅతని నామముగాక వేరే నామములో రక్షణ లేదని నమ్ముచున్నాము.

 

రక్షణ

శాశ్వతమైన నరకం నుండి రక్షింపబడటానికి ఒక వ్యక్తి తన క్రియల ద్వారా గాక విశ్వాసం ద్వారా మరియు పరిశుద్దాత్మ ద్వారా మరియు దేవుని వాక్యము ద్వారా తిరిగి జన్మించాలని మేము నమ్ముతున్నాము.

పాపము చేయని మరియు పవిత్రమైన రక్తాన్ని చిందించకుండా పాపాలకు ప్రాయశ్చిత్తం లేదని మేము నమ్ముతున్నాము. సర్వ మానవాళి చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయటానికి యేసుక్రీస్తు రక్తం యొక్క సమర్థతను మేము నమ్ముతున్నాము.

 

పరిశుద్దాత్మ

పునర్జన్మ సమయంలో పవిత్రాత్మ విశ్వాసి యొక్క హృదయంలోకి వస్తాడని మేము నమ్ముతున్నాము మరియు విజయవంతమైన మరియు ఫలవంతమైన క్రైస్తవ జీవితానికి శక్తిని ఇవ్వడానికి అతను విశ్వాసికి సహాయపడతాడని మేము నమ్ముచున్నాము. విశ్వాసిలో నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని పుట్టించి వారిని దినదినము పరిశుద్దపరుస్తూ ఆత్మ ఫలాన్ని దయచేసి లోకంలో క్రీస్తు చేసిన కార్యమునకు సాక్షులుగా ఉండేటట్లు చేస్తాడు. మరియు సంఘక్షేమాభివృద్ధి కొరకు దాని సభ్యులందరికీ ఆత్మవరాలు అనుగ్రహిస్తాడని మేము నమ్ముచున్నాము.

 

పునరుత్దానము

మేము రెండు సార్వత్రిక సాధారణ పునరుత్థానాలను నమ్ముతున్నాము. మొదటిది నీతిమంతుల మరియు రక్షింపబడినవారి పునరుత్థానం మరియు రెండవది అనీతిమంతుల మరియు రక్షింపబడనివారి పునరుత్థానం.