young

సమాధన బంధము ఎలా కలిగి ఉండాలి ?ప్రతి ఒక్కరు చదవవలసిన పాఠం !

మన ప్రియుల మధ్య లేదా మన స్నేహితుల మధ్య అనుకోని సందర్భాల్లో మనస్పర్ధలు వచ్చినప్పుడు లేదా విభేదించినప్పుడు మన హృదయంలో నిరాశ మొదలవుతుంది. ఏ బంధం లేని సంబంధం స్నేహబంధంగా మారిన అనుభవాలు మనందరికీ ఉంటాయి. ఒకసారి ఆ బంధం ఏర్పడ్డాక తమ సంతోషాలే మన సంతోషాలుగా అనుకునే బంధంలో భావాల మధ్య విభేదాలు మొదలవుతే... అది మనల్ని కృంగదీస్తుంది. సరే మనసు మార్చుకొని, గుండెను రాయిచేసి, వారితో నాకు సంబంధం లేదు అని అనుకుంటూ పొతే మనతో ఎవరు ఉండరు, ఆ తరువాత మనం ఒంటరైపోతాము. ఎదుటి వ్యక్తి మనల్ని అర్ధం చేసుకోలేదు, మన మనోభావాలను గౌరవించలేదు వారితో మాట్లాడి ఇంకా ప్రయోజనం ఉండదు అని అనుకుంటే పొరపాటే.

IPL ,BIG BOSS ,జబర్ దస్త్ షోలో లేని మస్తి దేవుని వాక్యములో ఉంది మీరే చదవండి !!

మనము చేసే పనులు మన మాటల  కంటే బిగ్గరగా మాట్లాడతాయి - కాని కోరికలు ఇంకా  పెద్దగా  మాట్లాడతాయి.

గుర్తు పెట్టుకో ఇదే నిజం !!

      చిరకాలం జ్ఞాపకం చేసుకోవలసిన సందేశం

🤦🤦కృంగుదల ,అవమానం ,పశ్ఛాత్తాపం,ఓటమి,నమ్మకద్రోహం, మనిషి హృదయం పై అంతరిక్షం నుండి జారిన శకలాలు భూమిపై సృష్టించేంతటి పేను బీభత్సాన్ని సృష్టిస్తాయ్..మనిషి జీవన పయనానికి ఆశ అనేది ఇందనం వంటిది దాన్ని నిర్విర్యం చేయగల ఆయుధాలే ఇవి...ఆశే ముగిశాక ఎందుకు బ్రతకాలని ఎవరికోసమని..ఏముందనీ....అంతా అయిపోయిందని..ఏమీ మిగలలేదని....చెప్పే ఆలోచనే ప్రతిక్షణం మనలో ఇక ఆశ ఆనేది పునరుత్పత్తి కాకుండా అడ్డుకునే అడ్డుబండలౌతాయ్.

అగ్నిపర్వతాన్ని ఆర్పే గుణం ?

💐💐    అంతరంగం అగ్నిమయమైతే ,చల్లార్చే గుణం స్నేహానికి ,ప్రేమకే ఉంటది ,నమ్మకద్రోహం ,నిర్లక్ష్యం,కృతజ్ఞతారాహిత్యం ,మనిషి భరించలేని మనోభారాలు . నీటికోసం తృప్తి లేకుండా ఆశతో ఎదురుచూసే ఎడారిలా మానవ హృదయం...నిబ్బరమైన శాంతి నిలకడయైన సంతృప్తి కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది కానీ ఆ ఆశ ఎప్పటికీ తీరేనూ...ఎడారిలో కురిసే చిరుజల్లులతొ ఎడారి దాహంతీర్చుకొని సంతుష్టి చెందగలదా ?

దేవుని ఉద్దేశాల కోసం మన ఆలోచనలను మార్చుకుంటే విజయము మన సొంతము!

క్రైస్తవుని జీవన శైలిలో రోజువారి జీవనం కొరకు పోరాడడం కంటే, జీవితంలో సాధించే వాటిని గూర్చిన ఆలోచనలు ఎంతో గొప్పవిగా ఉంటాయి. చేసే ప్రతి పనిలో దేవుణ్ణి ముందు పెట్టుకొని ఆ పనిని ప్రారంభించగలిగితే తప్పకుండా విజయలు పొందుతూ ఉంటాము. కొన్ని సార్లు అపజయాలను ఎదుర్కొనే పరిస్థితి మనకు ఎదురవుతుంది, కారణం..మనలోని బలహీనతలే. క్షుణ్ణంగా ఆలోచిస్తే మన బలహీనత మన ప్రత్యర్థి, దానిని జయించగలిగేది మన లక్ష్య సాధన కొరకైన ప్రోత్సాహం. ఈ ప్రోత్సాహం మనలను బలహీనతలనుండి బలవంతులను చేస్తుంది.

కాల్వినిస్టుల చిక్కుముడులకు క్రైస్తవుడి సరళమైన పరిష్కారములు

#కాల్వినిస్టుల_చిక్కుముడులకు_క్రైస్తవుడి_సరళమైన_పరిష్కారములు నా చిన్నతనంలో మా తాత ఈగ నర్సయ్య గారు ఇలా అనేవాడు "కానని మొహాని కప్ప దయ్యంలాగా కనపడింది" అని. అజ్ఞానికి సులువైన విషయాలు కూడా చిక్కుముడులౌతాయి. తనను తాను జ్ఞానినని చెప్పుకునేవాడికి రెండో ఎక్కము(2×2=4) కూడా TRIGONOMETRY లాగా కనపడింది. హితబోధ పేరుతో రోగిష్టిబోధను చేసి తను ధోరని కూడా ఇలాగే వుంది. హితబోధ వెబ్సైట్ లో వారు పెట్టిన .....

వాక్య దాహం కలిగిన మేరీ జోన్స్ ||ఆ దాహం నువ్వు కలిగి ఉన్నావా ?

చాలా కాలం క్రితం వేల్స్ అనబడిన ఒక చిన్న దేశం లో మేరీ అనే ఒక అమ్మాయి తన తల్లిదండ్రులతో కలిసి జీవించేది. వారు ధనవంతులు కాదు వారితో ఎక్కువ డబ్బులు కూడా లేవు. మేరీ ఉండే చోట స్కూల్స్ కూడా లేవు. అందువల్ల మేరి చదవడం రాయడం నేర్చుకో లేకపోయింది. కానీ ప్రతి ఆదివారము మేరీ తన తల్లిదండ్రులతో కలిసి చర్చికి వెళ్ళేది. అక్కడ పాస్టర్ గారు తన దగ్గర ఉన్న పెద్ద బైబిల్ లో నుంచి చెప్పే సంగతులు అన్నీ శ్రద్దగా వినేది. అక్కడ బైబిల్ నోవాహు ఇస్సాకు యాకోబు దావీదు ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి అలాగే ఏసు క్రీస్తు చేసిన అద్భుత గురించి వినడం మేరీకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేది.

కొన్ని కష్టాలు మన మేలు కోసమే||విశ్వాసము తో సాగిపో

ఒకరోజు ఏమి జరిగింది అంటే ఎలీషా అనే  ప్రవక్త శిష్యులలో ఒకాయన చనిపోవడముతో అతని కుటుంబమంతా రోడ్డున పడింది.

పాపమును చంపే వాక్సిన్ వచ్చేసింది ! !త్వరపడండి !

పాపమును జయించలేక అనేక సార్లు పదే పదే పడిపోయే  చాలా మంది క్రైస్తవులు చర్చి కి వచ్చి నా మైండ్ సెట్ మార్చుకోవాలి నా హృదయము మార్చుకోవాలి అని చాలా ఆశపడతారు అలా ఆశపడడము మంచిది అది మన వైపు నుండి మనము తీసుకునే మొదటి అడుగు , కానీ మనంతట మనము మారిపోదాము ఈ వారము నుండి అన్ని అలవాట్లు మానేసుకుని దేవుని నమ్ముకుంటాను అనుకుంటాము అయితే అది కొద్ది రోజుల మాత్రమే ఉంటుంది ఎందుకంటే మనము ఆత్మ కంటే కూడా మన ఆవేశములకే ఎక్కువ ప్రాధన్యత ఇస్తాము కాబట్టి పాపముల  మీద మనము తెచ్చుకున్న విజయము కొద్దికాలము మాత్రమే ఉండి  మల్లి మళ్ళి అదే పాపములో పడిపోతాము

Subscribe to యువ క్రైస్తవం