చిరకాలం జ్ఞాపకం చేసుకోవలసిన సందేశం

🤦🤦కృంగుదల ,అవమానం ,పశ్ఛాత్తాపం,ఓటమి,నమ్మకద్రోహం, మనిషి హృదయం పై అంతరిక్షం నుండి జారిన శకలాలు భూమిపై సృష్టించేంతటి పేను బీభత్సాన్ని సృష్టిస్తాయ్..మనిషి జీవన పయనానికి ఆశ అనేది ఇందనం వంటిది దాన్ని నిర్విర్యం చేయగల ఆయుధాలే ఇవి...ఆశే ముగిశాక ఎందుకు బ్రతకాలని ఎవరికోసమని..ఏముందనీ....అంతా అయిపోయిందని..ఏమీ మిగలలేదని....చెప్పే ఆలోచనే ప్రతిక్షణం మనలో ఇక ఆశ ఆనేది పునరుత్పత్తి కాకుండా అడ్డుకునే అడ్డుబండలౌతాయ్.

😓😓 ఇంతలోనే..పిలవని పేరంటానికి వచ్ఛినట్టు..గోతికాడ నక్కలా అవకాశం కోసం ఎదురు చూసే అవకాశవాదుల గుంపులు ఉండనే ఉన్నాయిగా...మాటలతో ,ప్రవర్తనతో నిన్ను చంపడానికి ఆయుధాలకు పదును పెడుతుంటారు....ఇక మన చిరకాల మిత్రుడు నాశనకారకుడూ అయిన అపవాది తనూ ఓ చేయి వేసి తన వంతుగా ఇక చఛ్ఛిపో ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావ్...ఇంతకు మించి పరిష్కారం లేదని చక్కని సలహా ఇచ్ఛి చావుకు సాగనంపుతాడు...🤦🤦🤦🤦🤦🙆🙆🙆🙆🙆🙆😰😰😰😰😰😰

👀 అప్పుడు బ్రతికి ఉండడానికి ఉపయోగించవలసిన వివేకం చావడానికి ఉపయోగిస్తాం...ఎవరికీ దొరక్కుండా చావడానికే ఎంతో తెలివిగా ప్రణాలికలు రచిస్తాం. కాని అదే తెలివి బ్రతకడానికి బ్రతికి సాధించడానికి...కసితో నిన్ను నీవు నిరూపించకోడానికి ,నీ ముందు దూషించిన వారి సిగ్గుతో తలదించేట్టు ఎదగడానికి..మదమెక్కిన గర్వంతో నీపై చెలరేగిన మృగాల నోళ్ళు మూయించడానికి ఉపయోగించం..

💕 👀 నీ బాధ నీకే బాధ నీ క్షోభ నీకే క్షోభ ! దాన్ని ఓదార్చడానికి ,నిన్ను అర్థం చేసుకొని నీయంత బాధపడి నిన్ను లోతుగా అర్థంచేసుకొని నిన్ను నిన్నుగా నీ వెన్ను తట్టి ప్రోత్సహించేంతటి మహాత్ములెవరూ మన చుట్టూ ఉండరు..కాలంవేగం ! మునుషల ఆలోచనలు ఎప్పటికీ స్వార్ధం ! ఇవి ఆగవు..నీవు కసితో నిలవాలి  ఈ కృంగుదలకు కారణభూతాలైన, ఈ అవమానం,నమ్మకద్రోహం,నిర్లక్ష్యం, అనే నీ బుర్రలో చైతన్య వంతమైన ఆలోచన చంపి ఉత్తేజితం కాకుండా చుుట్టూ అలముకున్న బూజును దులిపి విజృంభించి చెలరేగాలి కారుచీకటి కోరల్ల్లొ   ఆదమరచి అచేతనంగా ఉంటే నీకోసం ఈ కాలం ఆగదు...చివరికీ ఏదీ మిగలదు......

💐💐నీ జీవితంలో ఎవరు నీకు అత్యంత ప్రియులు ,నమ్మకమైనవారు అనుకుంటావో...గుర్తుపెట్టుకో నీకు వారివలనే..అత్యంత ఘోరమైన ,అవమానం ,వేదన ,మోసం ,నిరాదరణ, కలుగుతాయ్...ఇది సాతాను యొక్క దీర్ఘకాలిక కుట్ర...మరి ఎరివలన జరిగినా నీ జీవతం కలవరానికి ,కంపనకు గురికాదు..అందుకే వారిచేత నమ్మకత్వం, ప్రేమ ,స్నేహం ,నటింపజేస్తుంది నువ్వు దానిపైనే ఆధారపడేంత బలంగా నమ్మిస్తుంది.అప్పుడే నిన్ను కూల్చడానికీ వీలౌతుంది గదా ! 

మానవజాతి పతన చరిత్ర అంతా ఈ అనుభవాలతోనే దస్తావేజులన్నీ నిండి పోయి ఉంటాయ్ ప్రతీ పుటమూ గతం నేేర్పిన పాఠాలను దృష్టి పెట్టక విఫలులైన అవివేక శూన్యులైన వీరోచిత పతన శూరల గూర్చే రాయబడి ఉంటుంది..ఎలా బ్రతికామన్నదే కాదు ఎలా చఛ్ఛామన్నదె ముఖ్యం బైబిల్ మనకు పరిచయం చేసే భక్తుల చరిత్ర మనకు నేర్పేది అదే ఎలా మన ముగింపు ఉండాలో వారి జీవితాల ద్వారా దేవుడు మనకు నేర్పాడు..శుభకరమైన దైవాశిత జీవత ముగింపు ఫలభరితమై నిలిచింది.ఆడంబర ఇహలోకవాంఛిత జీవనం పతనాన్నే ఫలంగా ఇచ్ఛింది పాతాళ గమ్యానికి చేర్చింది.....మీ జాన్ సురేషన్నా

అందుకే అనుభవపూర్వకంగా మరోకసారి నేను నేర్చున్న  పాఠం...ఇదిగో..👇👇👇👇👇👇👇👇👇
కీర్తనల గ్రంథము121:1,2
1.కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? 
2.యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. 

Psalms(కీర్తనల గ్రంథము) 33:21

21.మన ప్రాణము యెహోవాకొరకు కనిపెట్టుకొను చున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై యున్నాడు. 

కీర్తనల గ్రంథము :28:7
7.యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెన గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను.

Share