
💐💐 అంతరంగం అగ్నిమయమైతే ,చల్లార్చే గుణం స్నేహానికి ,ప్రేమకే ఉంటది ,నమ్మకద్రోహం ,నిర్లక్ష్యం,కృతజ్ఞతారాహిత్యం ,మనిషి భరించలేని మనోభారాలు . నీటికోసం తృప్తి లేకుండా ఆశతో ఎదురుచూసే ఎడారిలా మానవ హృదయం...నిబ్బరమైన శాంతి నిలకడయైన సంతృప్తి కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది కానీ ఆ ఆశ ఎప్పటికీ తీరేనూ...ఎడారిలో కురిసే చిరుజల్లులతొ ఎడారి దాహంతీర్చుకొని సంతుష్టి చెందగలదా ? అంతే మనిషీ మనుషుల ,మమతలు ,మాటలు ,నమ్మి వాటితో తృప్తి పొందాలనుకోవడం వాటిలో శాంతిని వెదకాలనుకోవడం....స్వార్థంతో నిండిన ఘటాలైన మనిషి మరో స్వార్థపు ఘటాలలో ,నిస్వార్ధం, త్యాగం ,నిస్పక్షపాతం,ఆదరణ ,నమ్మకత్వం ఆశించడం బండరాయిలో నీటి ఊట వెదికినట్టేగదా !
,,💐💐 మనుషుల జీవితాలు అతలాకుతలం అవ్వడానికీ...ఊహించని మలుపులు తిరిగి విషాదాంతమో ,వీపరీత కంపితమో అవ్వడానికి హేతువు మనిషి తెలిసీ మనిషిని నమ్మడమే.....అతిగా వారిలో తాను కోరుకున్నవి ఆశించడమే....వాస్తవగ్రాహ్యం ఉన్నా తాను సృష్టించుకున్న ఊహాప్రపంచంలో మితములేని అంచనాలు వేయడమే...తుదకు వాస్తవం అనుభవపూర్వకంగా బోధపడేసరికీ...కృంగుదలకూ...అశాంతికీ గురై... ఇహ తనకుతానే...జ్ఞాపకాల ఆజ్యం తో గతకాలపు స్మ్రతులతో వాస్తవం మిగిల్చిన గాయంతో..అగ్నిని రాజేస్తూ క్షణం క్షణం... తానే ఆహుతౌతూఉంటాడు...అంచేత ఆగ్ని పర్వతం బద్జలవ్వకుండా ఉండాలంటే ఓదార్చే స్నేహం , సేదదీర్చి ,ధైర్యానిచ్చే ప్రేమ మనిషికి ఎప్పుడూ తోడుగా ఉండాలి...
,💐💐ముందే చెప్పానుగా...మనిషిలో అవి దొరకవనేది విదితమే గదా..మరి అవి దొరికె శాశ్వత వాస్తవ నిర్మిత ప్రాంతమేది? జగత్తు కు పునాది వేయక ముందే నువ్వునేను పుట్టకముందే...మనందరిపై ప్రేమ పెంచుకుని తన రూపంలో నిర్మించుకొని కృతఘ్నులమై దారితొలగి తిరుగుతూ...తనకు ప్రతిగా కల్పితాల పంచన చేరి తనను అవమానించినా .....మన శాశ్వత రక్షణకై తనంతటతానే మనవావతారుడై తనను తానే కరగదీసుకొని మనందరి పాపాలను బుజాన శిలువాగా మోసి నిష్కారణంగా నిందనూ ,హింసనూ భరించి నీకోసం భరించడంలో తృప్తిని చెంది ఇప్పటికీ మనకోసం తన రెండు చేతులూ చాచి తనకౌగిలికి ఆహ్వానిస్తున్నా యేసునాధుని కంటే...గమ్యస్థానముందా ?..
నిజమైన స్నేహం ,అసమాన నిజ ప్రేమలు సంమృధ్ధిగా..దొరుకు మూలస్థానం.ఆయనే...మనకు శాంతిని ,సంతుష్టిని కలిగించగల అసలైన ఆశ్రయస్థానం ఆయనే ...గంతులేసి చేరండి...మితములేని శాంతిని పొందండి... మీ జాన్ సురేషన్నా....👍💐💐💐💐