వాక్య పునాది అనే ఈ వేదిక దేవుని గుణ లక్షణాలను రాజీ పడకుండా ఆయన ప్రేమ, న్యాయం మరియు అన్ని నిస్తర లక్షణాలను సంపూర్ణంగా ప్రకటించేందుకు అపోస్తలుల పునాది పై నిలబడి యేసు ప్రభువు యొక్క దేవత్వానికి మరియు క్రైస్తవ భావజాలానికి విరోధంగా ఉండే ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకుని వచ్చి దేవుని రాజ్య స్థాపన మరియు విస్తరణ లో పాలి భాగస్తులు అవ్వాలనుకునే ప్రతి ఒక్కరికీ అందుబాటు లో ఉండే వేదిక.
ఈ వేదిక లో భాగంగా క్రైస్తవేతరులు, క్రైస్తవ గుంపు లో భాగం అని చెప్పుకునే దుర్బోదల శాఖలు మరియు క్రైస్తవ సమాజం లో అంగీకరించ బడినప్పటికీ ఆ ముసుగులో దేవుని వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చే బోధలు చేస్తున్న వారికి లేఖానాదారంగా ప్రేమ పూర్వక సమాధానం, బుద్ధి చెప్పడం, హెచ్చరించడం జరుగుతుంది. మాతో కలిసి పని చేయాలనుకున్న వారు సంప్రదించవలసిన ఈమెయిలు vakyapunadhi@gmail.com.
మా విశ్వాసము:
భూమ్యాకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రియైన దేవుని మేము నమ్ముచున్నాము. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి, కన్యయైన మరియకు పుట్టి, పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి, సిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయబడెననియు, పాతాళ లోకములోనికి దిగెననియు, చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి, పరలోకమునకెక్కి, సర్వశక్తిగల తండ్రియైన దేవుని కుడిచేతి వైపున కూర్చుండి యున్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడనుండి వచ్చుననియు నమ్ముచున్నాము. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాము. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు, శరీర పునరుత్థానమును,నిత్యజీవమును ఉన్నవని నమ్ముచున్నాము. ఆమేన్!